Delhi Weather: ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత.. నేడు తేలికపాటి వర్షం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Light Rain Expected in Delhi Today: ఈ శీతాకాలంలో భారత దేశం అంతటా ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఈ సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 5.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది ఈ సీజన్ సగటు కంటే రెండు నాచులు తక్కువగా ఉంది. ఇక ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని ఐఎండీ పేర్కొంది.
Also Read: Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. రిక్ట్కర్ స్కేల్‌పై 6.7 తీవ్రత!
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- 12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
మంగళవారం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి వర్షం లేదా చిరు జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు 15 డిగ్రీల సెల్సియస్ గరిష్ట, 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీతో పాటు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని ఐఎండీ పేర్కొంది. హర్యానా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు బీహార్‌లో ఇదే పరిస్థితి ఉంటుందనిచెప్పింది. పంజాబ్, హర్యానాలో వచ్చే 3 రోజులలో దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలతో పాటుగా రాజస్థాన్‌లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!