Site icon NTV Telugu

Delhi: వామ్మో.. ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టిన ప్రియురాలు..

Murder

Murder

Shocking Murder Case: దేశ రాజధాని ఢిల్లీ తిమార్‌పూర్‌లో అక్టోబర్ 6న జరిగిన యూపీఎస్‌సీ అభ్యర్థి దారుణ హత్యకు సంబంధించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను ఢిల్లీ పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో ప్రియురాలితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసి చంపి, సాక్ష్యాలను నాశనం చేసినందుకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.

READ MORE: Supreetha: మోకాళ్లపై శ్రీవారి మెట్లెక్కిన ప్రముఖ నటి కూతురు

అసలు ఏం జరిగింది..?
అక్టోబర్ 6న గాంధీ విహార్ లోని నాల్గవ అంతస్తు ఫ్లాట్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి కాలిపోయిన మృతదేహం కనిపించింది. తరువాత మృతుడిని 32 ఏళ్ల రామ్ కేష్ మీనాగా గుర్తించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కుట్రను బయటపెట్టింది. సంఘటన జరిగిన రోజున ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో కనిపించింది. వారిలో ఒకరు దాదాపు 39 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత.. తెల్లవారుజామున 2:57 గంటలకు ఒక మహిళ, మరో వ్యక్తితో కలిసి ప్లాట్‌ నుంచి బయటకు వచ్చింది. వెంటనే అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది.

READ MORE: Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఏపీ, యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ

ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రామ్‌ కేష్ ప్రియురాలు అమృత చౌహాన్(21) ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. అమృత చౌహాన్, ఆమె మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్( 27), అతని స్నేహితుడు 29 ఏళ్ల సందీప్ కుమార్ కలిసి రామ్‌ కేష్‌ మీనాను హత్య చేశారు. అనంతరం మృతదేహంపై నూనె, నెయ్యి, మద్యం పోసి ఎల్పీజీ సిలిండర్ రెగ్యులేటర్ తెరిచి పేల్చేశారు. దీన్ని అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఈ ముగ్గురూ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. రామ్‌ కేష్‌ మీనా వద్ద తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ఉందని అమృత తెలిపింది. వాటిని డిలీట్ చేయడానికి తన ప్రియుడు అంగీకరించలేదని అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించింది.

Exit mobile version