Site icon NTV Telugu

Air India Flight: ఢిల్లీ-పోర్ట్ బ్లేయర్ విమానం విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండిండ్‌

Air India

Air India

Air India Flight: ఢిల్లీ నుంచి పోర్ట్‌ బ్లేయర్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.. వాతావరణం అనుకూలించని కారణంగా.. విశాఖలో నిన్న రాత్రి ఎమర్జెన్సీగా ల్యాండ్‌ చేశారు పైలట్.. దీంతో.. ప్రయాణికులకు నిన్న రాత్రి ఒక హోటల్ లో వసతి ఏర్పాటు చేశారు… విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయిన నేపథ్యంలో.. పోర్ట్‌ బ్లేయర్‌ వెళ్లాల్సిన 270 మంది ప్రయాణికులు విశాఖపట్నంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.. ఇందులో అధిక సంఖ్యలో మెడికల్ కౌన్సిలింగ్ కి వెళ్లాల్సినవారే ఉన్నారని చెబుతున్నారు.. అయితే, 24 గంటలు గడిచినప్పటికీ విమానం ఎప్పుడు బయల్దేరుతుందనే ఖచ్చితమైన సమాచారం ఇప్పటికీ ఇవ్వకపోవడంతో.. ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు.. వీరంతా విశాఖపట్నం మేఘాలయ హోటల్లో బస చేశారు. అయతే, మెడికల్‌ కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సినవారు అధిక సంఖ్యలో ఉండడంతో.. వారిలో ఆందోళన మొదలైంది.. వెంటనే తమను గమ్యస్థానానికి చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Read Also: Anil Kumar Yadav: సిల్లీ బచ్చానే.. దమ్ముంటే రా.. నా మీద గెలిచినా.. నా విజయం ఆపినా..!

Exit mobile version