టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ కు పంత్ దూరమయ్యాడు. అతను లేని లోటును మరో విధంగా ( జట్టుతో పాటు డగౌట్ లో అతని నెంబర్ జర్సీ ఉన్న టీషర్ట్ ధరించేలా ) తీర్చుకోవాలని ఢిల్లీ ఫ్రాంఛైజీ భావించింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) రంగంలోకి దిగింది. అందుకే పంత్ కు అభ్యంతరం లేకపోతే.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోం గ్రౌండ్ మ్యాచ్ లు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రత్యేక ర్యాంప్ ను ఏర్పాటు చేస్తామని డీడీసీఏ తెలిపింది.
Also Read : Merugu Nagarjuna: పార్టీ లైన్ దాటితే ఎవరికైనా అటువంటి పరిస్థితి తప్పదు..
ఐపీఎల్ 16వ సీజన్ పంత్ ఆడకపోయినా డగౌట్ లో అతను ఉంటే బాగుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తుందని డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. అందుకే మేము ఒక ఆలోచన చేశాం.. పంత్ గ్రౌండ్ లో ఉంటే కంపర్ట్ గా ఫీలవుతాడంటే అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. అతన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేక మెడికల్ టీం సహా ఇంటి నుంచి స్టేడియానికి తీసుకురావాడానికి ప్రత్యేక ట్రాన్స్ పోర్ట్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. పంత్ దీనికి ఒప్పుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ డగౌట్ లో అతని కోసం ప్రత్యేక ర్యాంప్ ను ఏర్పాటు చేయనుంది.
Also Read : TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసు.. నేడు రేణుక బెయిల్ పిటిషన్ పై తీర్పు
ఢిల్లీ క్యాపిటల్స్ హెచ్ కోచ్ రికీ పాంటింగ్ పంత్ విషయంలో బాగా ఫీలయ్యాడు. పంత్ లేని లోటు మాకు తెలుస్తుందని.. అతను ఐపీఎల్ కు దూరమైనప్పటికి ఏదో ఒకలా అతను జట్టుతో పాటు ఉండేలా ప్లాన్ చేసుకుంటామని తెలిపాడు. అందుకు పంత్ జెర్సీ నెంబర్ తో కూడిన టీషర్ల్ లను ప్రత్యేకంగా తయారు చేయించి జట్టు మొత్తం ధరించేలా చూస్తామన్నాడు. అవసరమైతే పంత్ డగౌట్ లో కూర్చొబెట్టి మ్యాచ్ లు వీక్షించే అవకాశం కల్పిస్తామన్నారు. అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం అని పాటింగ్ పేర్కొన్నాడు.
Also Read : IPL 2023: ఇవేం పిచ్ లు రా బాబు.. పరుగులు చేయడం కష్టమే!
పంత్ కారు యాక్సిడెంట్ తర్వాత అతని స్థానంలో ఆసీస్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా నియమించింది. వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. ఇక ఐపీఎల్ లో కెప్టెన్ గా వార్నర్ కు అనుభవంతో పాటు మంచి పేరు ఉంది. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎంపిక చేసింది. ఏప్రిల్ ఒకటిన లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది.
