Delhi Car Blast: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరిని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీలో కారు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఈ హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
READ ALSO: Vijay Sethupati : హీరోయిన్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
డెలివరి బాయ్ సజీవదహనం
ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర భారీ పేలుడు కారణంగా మంటలు అంటుకొని ఒక డెలివరి బాయ్ సజీవదహనం అయ్యారు. పేలిన కారులో హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్ ఉపయోగించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఆయన ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, ఐబీ చీఫ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడి తనతో మాట్లాడినట్లు అమిత్‌షా వెల్లడించారు. పేలుడుపై NIA, NSG దర్యాప్తు జరుగుతోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు ముందుకుసాగుతుందని పేర్కొన్నారు. పేలుడు జరగగానే 10 నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించినట్లు చెప్పారు.
ఆస్పత్రికి అమిత్‌షా..
అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా LNJP ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పేలుడుపై NIA, NSG దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అనంతరం అమిత్‌షా పేలుడు జరిగిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇప్పటికే పేలుడు ఘటనలో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు జరిగిన కారు హర్యానాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. పేలుడు సమయంలో కారులో ముగ్గురు ఉన్నారని తెలిపారు. సాయంత్రం 6:52 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నదీమ్‌ఖాన్ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్ అయ్యిందని, దాని రిజిస్ట్రేషన్ నంబర్ HR267674 అని పేర్కొన్నారు.
READ ALSO: Delhi Car Blast Live Updates : పేలుడులో 13 మంది మృతి.. ఉగ్రకోణంలో పలు అనుమానాలు..!
