ఢిల్లీలో (Delhi) ఓ పోలీస్ ఆఫీసర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అలాగే క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటారు. ఇక శుక్రవారం అయితే ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ఢిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలోని ఓ మసీదు దగ్గర నమాజ్ జరుగుతోంది. లోపల చోటు సరిపోక.. రోడ్డుపైకి వచ్చి కొందరు ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్.. వారిపై భౌతికదాడి చేశారు. వారిని తోసేయడంతో పాటు.. కాళ్లతో తన్నడం.. పిడిగుద్దులు గుద్దడం చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడ్డ పోలీస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. అలాగే క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.
