NTV Telugu Site icon

Brij Bhushan: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ కు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్

Brij Bhushan

Brij Bhushan

మైనర్ మహిళా రెజ్లర్‌పై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఏడుగురు రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఇవాళ రెండు కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఆరుగురు వయోజన మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై నమోదైన కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కాగా మైనర్ రెజ్లర్ చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పాటియాలా కోర్టులో రెండో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. మైనర్ చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.

Also Read : Sabitha Indrareddy: పూర్తి సమాచారం వచ్చిన తర్వాత లఖిత మృతిపై మాట్లాడతా..!

వాస్తవానికి ఏప్రిల్ 21న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై మొదటి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు.. కాగా మైనర్ ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద మొదటి కేసును నమోదు చేసుకున్నారు.

Also Read : Mvv Satyanarayana: నా ఫ్యామిలీ సేఫ్..విశాఖ ఎంపీ కీలక ప్రకటన!

అయితే.. ఫోక్సో ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసులు 550 పేజీల నివేదికలో పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో, పోక్సో కింద బ్రిజ్ భూషణ్‌పై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని పోలీసులు కోర్టుకు సిఫార్సు చేశారు. అంతే కాదు పోక్సో కేసులో విచారణ పూర్తైన తర్వాత కేసును రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ తండ్రి, బాధితురాలి వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఈ నివేదికను కోర్టుకు సమర్పించారు.

Also Read : Kottu Satyanarayana: కాపులను వాడుకుని వదిలేయలని పవన్‌ చూస్తున్నాడు..

మైనర్ మహిళా రెజ్లర్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. దీంతో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన మొదటి వాంగ్మూలంలో, మైనర్ లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. రెండో స్టేట్‌మెంట్‌లో, మైనర్ లైంగిక వేధింపుల ఆరోపణను ఉపసంహరించుకుంది. తనను ఎంపిక చేయలేదనే కోపంలో లైంగిక వేధింపుల కేసు నమోదు చేశానని చెప్పింది. దీంతో ఈ కేసులో ఫోక్సో చట్టం వర్తించదని రౌస్ అవెన్యూ కోర్టు తెలపడంతో బ్రిజ్ భూషన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది.

Show comments