Site icon NTV Telugu

Parliament: ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?

Parliament

Parliament

Parliament: ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 2023 మే 28న ఈ భవనాన్ని ప్రారంభించారు. రెండెళ్లుగా అదే భవనంలో సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా భవనానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ భవనంలో ‘నంబర్‌ 1 (Number 1 Tree)’ పేరు గల ఓ పసుపు పూల చెట్టు ఉంది. ఇది ఇప్పుడు ప్రధాని మోడీతో సహా వీవీఐపీల భద్రతలు ముప్పుగా మారిందట. దాన్ని అక్కడ నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఏంటి ఈ కథ తెలుసుకుందాం..

READ MORE: Pakistan reaction Agni 5: పాక్‌లో మంటలు రేపిన అగ్ని 5 .. కాళ్ల బేరానికి, తలబిరుసుతనానికి దిగిన దాయాది నేతలు

వాస్తవానికి.. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఆరు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. అందులో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఈ మార్గం నుంచే సభలోనికి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ గేటు వద్ద “నంబర్‌ 1″గా పేర్కొనే ఓ పసుపు పూల చెట్టు ఉంది. మొదట్లో చిన్నగానే ఉన్న ఈ చెట్టు ఇప్పుడు బాగా ఎత్తు పెరిగింది. ఇప్పుడు ఈ చెట్టు ఈ ప్రాంతంలో భద్రతకు అడ్డంకిగా మారింది. వీవీఐపీలు వెళ్లే మార్గంలో ఈ చెట్టు వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ చెట్టును ఇక్కడ నుంచి తొలగించి వేరే ప్రదేశానికి మార్చాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీని వల్ల వీవీఐపీల భద్రతకు ముప్పు ఉందని భావించిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్యూడీకి)కి సమాచారం అందించింది. ఈ చెట్టును తొలగించాలంటే ఢిల్లీ అటవీ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో ఆ భద్రతా సిబ్బంది ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటికే అటవీశాఖ వద్ద రూ.57వేల సెక్యూరిటీ డిపాజిట్‌ను జమ చేశారు. వచ్చేవారం పార్లమెంట్‌ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్‌ వద్దకు దీన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

READ MORE: YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్‌ ఆందోళన.. ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగి..!

Exit mobile version