Bomb Threat : ఢిల్లీలోని 150 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ నెల ప్రారంభంలో దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. బాంబును పెడతామని బెదిరించే ఇమెయిల్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుండి పంపినట్లు అనుమానిస్తున్నారు. ఈ మెయిల్స్ ఐపీ అడ్రస్‌ల పరిశీలనలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. తదుపరి విచారణ కోసం ఢిల్లీ పోలీసులు త్వరలో హంగేరియన్ పోలీసులను సంప్రదించనున్నారు. IP (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామా అనేది ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన ప్రతి పరికరానికి కేటాయించబడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య.
Read Also:RR vs RCB Eliminator: నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. ఇంటికి వెళ్లేదెవరో?
ఇ-మెయిల్‌లు Mail.ru సర్వర్ నుండి పంపబడినట్లు చెబుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు మెయిల్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత పాఠశాలల నుండి పిల్లలను పెద్ద ఎత్తున వెతకడం, తరలించే ఆపరేషన్ ప్రారంభించబడింది. అయితే, విచారణ తర్వాత పోలీసులు.. బెదిరింపు నకిలీదని నిర్ధారించి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలు తెరవడానికి ముందే బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. దాదాపు అన్ని పాఠశాలలకు ఒకే రకమైన మెయిల్ పంపబడింది. చాలా పాఠశాలలకు వచ్చిన మెయిల్‌ల సమయం కూడా అదే విధంగా ఉందని చెప్పారు. పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్ వార్త తెలియగానే తల్లిదండ్రులంతా పాఠశాలల వైపు పరుగులు తీశారు.
Read Also:Anchor Shyamala: రేవ్ పార్టీలో యాంకర్… వీడియో రిలీజ్ చేసిన శ్యామల!
అయితే, పాఠశాల ఆవరణలో అభ్యంతరకరంగా ఏమీ కనిపించకపోవడంతో ఈ బెదిరింపును పుకారుగా ప్రకటించారు. దీని తరువాత, ఈ విషయంపై కేసు నమోదు చేసిన తరువాత, పోలీసులు ఇంటర్‌పోల్ ద్వారా రష్యాకు చెందిన మెయిల్ సర్వీస్ కంపెనీ Mail.ru కి లేఖ రాశారు. ఢిల్లీ తర్వాత ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గోమతి నగర్‌లోని విరామ్ ఖండ్‌లో ఉన్న విబ్‌గ్యోర్ పాఠశాల కార్యాలయానికి బాంబుతో పేల్చివేస్తామని బెదిరిస్తూ మెయిల్ పంపబడింది. అధికారులు హడావుడిగా పాఠశాలలను తనిఖీ చేయగా, అది నకిలీ ఇమెయిల్ అని తేలింది. ఈ బెదిరింపుపై యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.