Delhi MCD Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 4న నిర్వహించబడుతుంది. ఫలితాలు డిసెంబర్ 7న ప్రకటించబడతాయి. నోటిఫికేషన్ విడుదల నవంబర్ 7న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 19 వరకు ఉండనుంది.
8 Fetuses Found: 21 రోజుల నవజాత శిశువు కడుపులో 8 పిండాలు.. అరుదైన చికిత్స విజయవంతం
డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాలను రీ డ్రా చేసినట్లు ఎస్‌ఈసీ తెలిపింది. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 250 వార్డులు ఉంటాయి. అంతకుముందు దేశ రాజధాని అంతటా 272 వార్డులు ఉండేవి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 68 నియోజకవర్గాల్లో అధికార పరిధిని కలిగి ఉంది. 42 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయని ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ ఇవాళ తెలిపారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన 42 సీట్లలో 21 ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడతాయని దేవ్ చెప్పారు. మొత్తం 250 వార్డుల్లో 104 స్థానాలను మహిళలకు కేటాయించినట్లు చెప్పారు.
