Site icon NTV Telugu

Delhi Metro: ఢిల్లీ మెట్రో సరికొత్త రికార్డు..!

Delhi Metro

Delhi Metro

ఢిల్లీ మెట్రో (Delhi Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో చరిత్రలోనే ఇదొక సరికొత్త అధ్యాయం. మంగళవారం మెట్రో స్టేషనలన్నీ జాతరను తలపించాయి. ఇసుకేస్తే రాలనంత జనం. నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో హస్తిన వాసులు ప్రయాణం చేశారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనతో అట్టుడుకుతోంది. వేలాది మంది అన్నదాతలు హస్తినకు తరలివచ్చారు. దీంతో సరిహద్దులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ముందుకు కదిలే పరిస్థితులు లేవు. ఉద్యోగస్తులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎటు చూసినా భద్రతా బలగాలు మోహరించాయి. రోడ్లన్నీ మూసివేశారు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి 13న అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆ క్రమంలో రైతులతో పాటు ప్రజలు సమయాన్ని ఆదా చేయడానికి ప్రజలంతా మెట్రో రైలును ఆశ్రయించారు. దీంతో స్టేషన్‌లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. ఆ విషయాన్ని తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC) ఓ ట్వీట్ ద్వారా తెలిపింది.

ఫిబ్రవరి 13న (మంగళవారం) దాదాపు 71.09 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారని డీఎంఆర్‌సీ గణాంకాలను విడుదల చేసింది. ఇంతకు ముందు సెప్టెంబర్ 2023లో ఢిల్లీ మెట్రోలో 71.03 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగా.. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసినట్లు DMRC సోషల్ మీడియా ‘ఎక్స్‌’ ద్వారా పంచుకుంది.

 

Exit mobile version