Site icon NTV Telugu

Welcome to Delivery Boy: జొమాటో డెలివరీ బాయ్‌కు ఘన స్వాగతం.. హారతిచ్చి మరీ.. కారణమేంటో?

Delivery Boy

Delivery Boy

Welcome to Delivery Boy: ప్రస్తుతం దాదాపు అందరూ ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టడానికే చూస్తున్నారు. బిజీ లైఫ్‌ కారణందా.. ఏదైనా ఇంట్లో స్పెషల్‌ అయితే ఆ రోజు రెస్టారెంట్ నుంచి ఆర్డర్‌ పెట్టాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. చాలావరకు స్మార్ట్‌ఫోన్‌ సాయంతో ఒక్క క్లిక్‌తో నచ్చిన భోజనాన్ని ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు పెట్టిన ఆర్డర్‌ కొంచెం లేట్‌గా వచ్చిన డెలివరీ బాయ్‌కు చుక్కలు చూపిస్తారు. అయితే తాజాగా ఓ కస్టమర్ అందరికంటే బిన్నంగా వ్యవహరించాడు. ఆలస్యంగా ఫుడ్‌ను తెచ్చిన డెలివరీ బాయ్‌కు వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Election Commission: సీఈసీ సంచలన నిర్ణయం.. ఒక అభ్యర్థి ఒక చోటే పోటీ&

ఢిల్లీలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ కస్టమర్‌ జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకున్నాడు. ఓ వైపు వర్షం.. మరోవైపు పండుగ కావడంతో ఫుల్ ట్రాఫిక్‌ను దాటుకుని జొమాటో డెలివరీ బాయ్‌ ఎట్టకేలకు ఫుడ్‌ను డెలివరీ అందించాడు. అయితే డెలివరీ గంట ఆలస్యం అయింది. ఫుడ్‌ను డెలివరీ ఇస్తున్న సమయంలో సదరు కస్టమర్‌.. వినూత్నంగా స్వాగతం పలికాడు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కుమార్‌.. గుమ్మం ముందుకు వచ్చిన వెంటనే కస్టమర్‌.. డెలివరీ బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతి ఇచ్చి స్వాగతం పలికాడు. దీంతో ఆ డెలివరీ బాయ్‌ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. నవ్వుతూ అలాగే నిలబడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుండగా.. డెలివరీ బాయ్‌లు కూడా మనుషులేనని.. అర్థం చేసుకున్న వాళ్లు ఇలాగే స్పందిస్తారని నెటిజన్లు స్పందిస్తున్నారు.

 

Exit mobile version