NTV Telugu Site icon

Dehi Liquor Scam: లిక్కర్ స్కాం.. కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధం?

New Project (13)

New Project (13)

Dehi Liqour Scam: దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా ఆప్ కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధమైందని సమాచారం. లిక్కర్ స్కాం కేసులో తాజాగా సీబీఐ.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 17 సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం సిసోడియా కేంద్రంగానే సాగిందనే ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Snake Venom: డార్జిలింగ్‌లో 2.5కేజీల పాము విషం పట్టివేత.. విలువ రూ.30కోట్లు

తనకు సీబీఐ నోటీసు ఇవ్వడంపై మనీశ్ సిసోడియా స్పందించారు. సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, దర్యాప్తునకు సహకరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో తన ఇంట్లో 14 గంటలపాటు సీబీఐ సోదాలు జరిపినా వాళ్లకు ఏమి దొరకలేదన్నారు. సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి దర్యాప్తుకు సహకరిస్తానని ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు. ఇది ఇలా ఉండగా.. మనీశ్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు. సిసోడియాను స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్‌ తో పోల్చుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కటకటాలు, ఉరికంబం భగత్ సింగ్ దృఢ సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయాయని అన్నారి. ఇది రెండో స్వాతంత్ర్య పోరాటమని అభివర్ణించారు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు ఈ తరం భగత్ సింగులని కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మనీశ్ సిసోడియా ఈడీ ముందు నేడు హాజరు అవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సిసోడియా అరెస్ట్ రంగం సిద్ధమైందని.. ఆయనను అరెస్ట్ చేస్తే ఆందోళన చేసేందుకు ఆప్ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే ఢిల్లీలో పలుచోట్ల అందోళనకు అధికారపార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Read Also: Rajasthan High Court: భార్యను తల్లిని చేసేందుకు 15రోజులు పర్మిషన్ ఇచ్చిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ లో పలు సార్లు సీబీఐ, ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులో వెన్నమనేని శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. పలు సార్లు విచారణ తర్వాత బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక తాము అరెస్ట్ చేసిన బోయినపల్లి అభిషేక్ ను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. కస్టడీ విచారణలో అభిషేక్ ఇచ్చిన వివరాల ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. లిక్కర్ స్కాంలో కేసులో త్వరలోనే కీలక నేత అరెస్ట్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది.