Rajasthan High Court: భార్యను తల్లిని చేసేందుకు 15రోజులు పర్మిషన్ ఇచ్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan High Court: అతను ఓ జీవిత ఖైదీ.. ఓ బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడి చేసిన కేసులో అతడికి కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో తాను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య తాను తల్లిని కావాలనుకుంటున్నాంటూ కోర్టు మెట్లెక్కింది. భర్తకు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ వేసింది. భార్యను తల్లి చేసేందుకు కోర్టు పెరోల్ బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన రాహుల్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని రాహుల్ భార్య హైకోర్టును ఆశ్రయించింది.
Read Also: Andhra Pradesh: రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లో జమ కానున్న రూ.4వేలు
Also Read
ఈ కేసును విచారించిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్ కోరికను మన్నించింది. దోషి భార్య పిల్లలు కావాలని కోరుకుంటోందని, భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె తన వంశ పరిరక్షణ కోసమే పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొంది. పిటిషన్‌ను తిరస్కరిస్తే హక్కులను కాలరాసినట్టే అవుతుందన్న కోర్టు.. దోషికి 15 రోజుల పెరోలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి పెరోలు పొందొచ్చని సూచించింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!