కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు మే 6 కు రిజర్వ్ చేసింది. ఈడీ తరపున జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరపు న్యాయవాది నితీష్ రానా ఈడీ వాదనలపై ఎల్లుండి లిఖితపూర్వకంగా తమ రిజాయిండర్ ఇస్తామని కోర్టుకు తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ వాదనలు.. లిక్కర్ కేసులో ఎవరి పాత్ర ఎంటనేది ఈడీ వివరించింది. ఈ కేసులో కవిత ప్రస్తావనను సైతం కోర్టుకు తెలిపింది. లైసెన్స్, మార్జిన్ ఫీజు పెంచడంలో ఎటువంటి లాజికల్ కంక్లూజన్ లేదని స్పష్టం చేసింది. నూతన మద్యం పాలసీలో 5 శాతం మార్జిన్ నుంచి 12 శాతానికి పెంచారని వెల్లడించింది. పెంచిన లాభాన్ని తిరిగి వెనక్కి పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించింది. కేజ్రీవాల్ సౌత్ గ్రూప్ ల మధ్య.. విజయ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారని చెప్పింది. కొత్త పాలసీ కొందరికి మేలు జరిగేలా తయారు చేశారంది.
READ MORE: Akhilesh Yadav: లోక్‌సభ బరిలో ఎస్పీ చీఫ్.. కన్నౌజ్ నుంచి పోటీ..
పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని ఈడీ స్పష్టం చేసింది. “లిక్కర్ స్కాం, వ్యాపారంలో ఇండో స్పిరిట్ చాలా కీలకంగా ఉంది. సుప్రీం కోర్టులో కూడా లిక్కర్ కేసులో ఉన్న వాళ్లకు బెయిల్ లభించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక అంశాలు తన స్టేట్మెంట్ లో ఇచ్చారు. లిక్కర్ వ్యాపారం కోసం ఢిల్లి సెక్రటేరియట్ కేజ్రివాల్ ను మాగుంట శ్రీనివాసులు కలిశారు. కేజ్రీవాల్ సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కల్వకుంట్ల కవితను కలిశారు. ఢిల్లి లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ భాగస్వామ్యం కోసం ఆప్ కు 100 కోట్లు ముడుపులు చెల్లించారు. కవిత 100 కోట్ల రూపాయలు మాగుంటను అడిగారు. కే కవిత ఆదేశాల మేరకు 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ చేరవేసింది. లిక్కర్ కేసులో క్విడ్ ప్రో జరిగింది. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ కోసం కవిత తరపున బుచ్చిబాబు లైజనింగ్ చేశారు.” అని కోర్టుకు ఈడీ వివరిచంది.
బుచ్చిబాబు, మాగుంట రాఘవ ల వాట్సప్ చాట్స్ లో సాక్ష్యాధారాలు దొరికాయని ఈడీ తెలిపింది. “మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి సాక్ష్యాలను ధ్రువీకరించారు. లిక్కర్ పాలసీ వారికి అనుకూలంగా రూపకల్పన చేసేందుకు లంచాలు ఇచ్చారు. కోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లను అనుమనించడం అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పపట్టడమే. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.. ఎవరు ఏ పార్టీకి ఎలాక్టోరల్ బాండ్లు ఇచ్చారనేది ఈ కేసులో అనవసరం. లిక్కర్ కేసులో లేనని, లిక్కర్ పాలసీ రూపకల్పన తెలియదని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. కే కవిత, ఢిల్లి సీఎం, డిప్యూటీ సీఎం లతో రాజకీయ ఒప్పందం ఉందని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేశారు.10 ఫోన్లు ఇచ్చారు.. ఇచ్చిన ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారు. ఎందుకు డిలీట్ చేసారని కవితను అడిగితే సమాధానం చెప్పలేదు. మార్చి 14, 15 తేదీల్లో కవిత తన నాలుగు ఫోన్లు ఫార్మాట్ చేశారు. ఫోన్లు ఇవ్వాలని కోరిన తర్వాతే నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారు, సాక్ష్యులను బెదిరించారు. కవిత మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన గ్రౌండ్స్ ను . రెగ్యులర్ బెయిల్ విషయంలోనూ పరిగణలోకి తీసుకోవాలి.” అని ఈడీ తన వాదనలు కోర్టుకు వినిపించింది.