Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌండ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, మనీష్‌లను కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సహచరుడు మనీష్ సిసోడియాలను రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు (lacunae) ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్‌మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు (prima facie case) కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌ను సరైన ఆధారాలు లేకుండా ఇరికించారని జడ్జి వ్యాఖ్యానించారు.
READ MORE: O Panneerselvam: డీఎంకేలో చేరిన జయలలిత ఆప్తుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం..
Also Read
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తీర్పు తర్వాత, తనపై ఉన్న కేసు పూర్తిగా కల్పితమని మరోసారి పునరుద్ఘాటించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయడానికి స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని ఐదుగురు ప్రముఖ నాయకులను జైలులో పెట్టారని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరెస్టు చేసి జైలుకు పంపారని, ఇది భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని అన్నారు. తాను ఆరు నెలలు జైలులో ఉన్నానని, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు రెండు సంవత్సరాలు జైలులో గడిపారని తెలిపారు. ఈ లిక్కర్ వ్యవహారం కల్పితమని, తన ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. టీవీ ఛానెళ్లలో తనను పదే పదే అవినీతిపరుడిగా చిత్రీకరించారని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ, సీబీఐ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని సీబీఐ సూచించింది. ఇక సీబీఐ న్యాయవాదులు ఈ ఉత్తర్వును వివరంగా అధ్యయనం చేసి అప్పీల్ దాఖలు చేయనున్నారు.
READ MORE: JrNTR-Neel : ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘డ్రాగన్’ అప్‌డేట్..
తాజావార్తలు
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!