NTV Telugu Site icon

Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం హైకోర్టు తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

Keje

Keje

లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ వచ్చినట్లే వచ్చి ఆవిరైపోయింది. బెయిల్ సంతోషం ఆప్ నేతలకు ఎన్నో గంటలు లేకుండా పోయింది. ఢిల్లీ కోర్టు.. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అంతే రౌస్ అవెన్యూ తీర్పుపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. మూడు రోజుల పాటు బెయిల్‌ను హైకోర్టు పెండింగ్‌లో పెట్టింది. మరోవైపు హైకోర్టు నిర్ణయాన్ని కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టు తీర్పు వరకు వేచి ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Crime News: రూ.9వేల కోసం బావా బావమరిదిల మధ్య వివాదం.. ఒకరి హత్య, మరో ముగ్గురికి కత్తిపోట్లు

ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ బెయిల్‌ రద్దుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ హైకోర్టుకు వెళ్లడంతో దానిని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై సోమవారం కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్‌ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఏం తేలుస్తుందనేదానిపై ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Viral Video: ఇలా తయారయ్యారేంటిరా బాబు.. రీల్స్ కోసం మరీ ఇంతలా అవసరమా..