Delhi High Court: రెస్టారెంట్ల సంఘాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీల తీరును తప్పుబట్టింది. విక్రయించే వాటిపై ఎమ్మార్పీ కంటే ఎక్కువే తీసుకుంటున్నప్పుడు మళ్లీ అదనంగా సర్వీస్ ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారంటూ రెస్టారెంట్ల సంఘాలను నిలదీసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీ తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం, భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య పిటిషన్ దాఖలు చేశాయి.
READ ALSO: Viral Video: వామ్మో గద్ద.. చూస్తుండగానే ఎంత పని చేసింది!
ఈ పిటిషన్‌పై తాజాగా ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాననం విచారణ జరిపింది. రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.100 వసూలు చేస్తున్నప్పుడు మళ్లీ వినియోగదారుడు విడిగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ తీసుకుంటారా, ఆదనంగా రూ.80 ఎందుకివ్వాలని ధర్మాసనం రెస్టారెంట్ల సంఘాలను ప్రశ్నించింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) తరపు న్యాయవాదిని ధర్మాసనం ఒక ఉదాహరణ ద్వారా రెస్టారెంట్లు రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.100 వసూలు చేస్తున్నప్పుడు కస్టమర్ అది అందించే సేవలకు అదనపు ఛార్జీ ఎందుకు చెల్లించాల్సి వస్తుందని ప్రశ్నించింది.
“మీరు మీ మెనూలో రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.100 ఎందుకు కోట్ చేస్తున్నారు. ఈ 80 రూపాయలు అదనంగా మీరు అందిస్తున్న వాతావరణానికా? ఇది కరెక్ట కాదు. మీరు MRP కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయగలరా? మీరు వసూలు చేస్తున్న రూ.80 దేనికి?” అని బెంచ్ ప్రశ్నించింది. వినియోగదారుల ఫిర్యాదులు, రెస్టారెంట్ బిల్లులను ప్రస్తావిస్తూ, సర్వీస్ ఛార్జీని ఏకపక్షంగా వసూలు చేస్తున్నారని, బలవంతంగా అమలు చేస్తున్నారని, దానిని చూస్తూ “మూగ ప్రేక్షకుడిగా” ఉండలేమని బేంచ్ స్పష్టం చేసింది. వాదనలు నమోదు చేసుకున్న కోర్టు విచారణను సెప్టెంబరు 25 వాయిదా వేసింది.
READ ALSO: Delhi murder case: ఢిల్లీలో సంచలనం.. సంచిలో డెడ్ బాడీ.. కిల్లర్‌ను పట్టించిన ట్యాటూ
