Site icon NTV Telugu

Political Parties: విపక్షాల కూటమికి షాక్.. హైకోర్టు నోటీసులు

Delhi High Court

Delhi High Court

Political Parties: అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఇండియాన్ నేషనల్ డెవలప్‌మెంట్‌ ఇంక్లూజివ్ అలయన్స్ పెట్టాయి. దీనికి షార్ట్ కట్ గా ఇండియా అని పేరు పెట్టారు. దీనిపై మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను సెంటిమెంటుతో మోసం చేయాలని చూస్తున్నారని పిటిషనర్ గిరీష్ భరద్వాజ్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ద్వేషానికి, హింసకు దారితీసేందుకు ఈ పదాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాయన్నారు.

Read Also: Pawan Kalyan: ప్రతిపక్షం గొంతు నొక్కేలా నియంతృత్వం పెచ్చరిల్లుతోంది

ఈ పిల్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ విపక్ష కూటమికి నోటీసులు ఇచ్చింది. వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది. మరోవైపు ఇండియా కూటమిపై ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కూటమిని ఇండియా అని కాకుండా ఘమండియా అని పిలవాలని సూచించారు. ఈ హిందీ పదానికి అర్థం దురహంకారి. పేదలకు వ్యతిరేకంగా వారు ఎలా కుట్రలు పన్నుతున్నారో దాచిపెట్టేందుకు యూపీఏ నుంచి ఇండియాగా పేరు మార్చుకున్నారని ఫైర్ అయ్యారు.

Exit mobile version