NTV Telugu Site icon

Kejriwal: కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని పిటిషన్.. లక్ష జరిమానా..!

Kejriwal

Kejriwal

Delhi High Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను నిషేధించాలని కూడా పిటిషన్‌లో డిమాండ్ చేశారు. ఈ పిల్ ను కోర్టు తిరస్కరించడమే కాకుండా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

Read Also: Madhyapradesh : ముందు గుడికి దండంపెట్టాడు.. తర్వాత బాంబులు వేశాడు

కాగా, శ్రీకాంత్ ప్రసాద్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, కేబినెట్‌ సభ్యులతో కేజ్రీవాల్‌ మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని జైలు డీజీని ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించి శ్రీకాంత్ ప్రసాద్‌ అనే న్యాయవాదికి రూ.లక్ష జరిమానా కూది విధించింది. ఎయిమ్స్ ఖాతాలో జమ చేయాలని పిటిషనర్‌ను కోరారు. పిటిషనర్‌ను కోర్టు మందలించడంతో పాటు పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది.

Read Also: Komatireddy Venkat Reddy: మాది RR కాదు.. మీది AA.. మోడీకి కోమటిరెడ్డి సెటైర్‌

ఇక, ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా, రాష్ట్రపతి పాలనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకుండా మీడియాను నిలిపివేయాలని పిటిషన్‌లో శ్రీకాంత్ ప్రసాద్ డిమాండ్ చేశారు. దీనిపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎమర్జెన్సీ విధించాలా లేక మిలటరీ పాలన విధించాలా అని ప్రశ్నించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21వ తేదీ నుంచి జైలులో ఉన్నారు. ఆరోపించిన మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని పట్టుదలగా ఉన్నారు. తమ అధినేత సీఎం పదవికి రాజీనామా చేయరని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.