NTV Telugu Site icon

Delhi High Court: అగ్నిపథ్ స్కీమ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టివేత

Agnipath Scheme

Agnipath Scheme

Delhi High Court: అగ్నిపథ్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ పథకం జాతీయ భద్రత ప్రాతిపదికన తీసుకున్న విధాన నిర్ణయమని ఎత్తిచూపుతూ హైకోర్టు ఇలా చెప్పింది. ఈ కోర్టు పథకంలో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు.. అన్ని పిటిషన్లు కొట్టివేయబడ్డాయని కోర్టు పేర్కొంది.

Read Also: Fever: జ్వరం వస్తే ఇలా చేయండి.. వెంటనే తగ్గిపోతుంది!

2019 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్/ప్రకటనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను కోర్టు కొట్టివేసింది. రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటనల ద్వారా ఎటువంటి ప్రామిసరీ ఎస్టోపెల్ లేదా చట్టబద్ధమైన నిరీక్షణ సృష్టించబడలేదు.ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పిటిషన్లు కొట్టివేయబడ్డాయని అని కోర్టు జోడించింది. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చారని భావిస్తున్నామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.