జ్వరం వస్తే బ్రతికి ఉండగానే నరకం కనిపిస్తుంది అనేది మాత్రం నిజం. అసలు ఏమి చేయాలనిపించదు, ఏమి తిన్న సహించదు.
జ్వరం తగ్గడానికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉండాలి.
జ్వరం తగ్గే వరకు కూడా నీరసంగా ఉండి, ఏది వచ్చినా పర్వాలేదు కానీ జ్వరం రాకూడదు అనుకుంటూ ఉంటారు. అయితే జ్వరాన్ని అరగంటలో తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు.
ఓ 200 గ్రాములు పెసరపప్పు తీసుకుని దాన్ని ఒకసారి కడిగేసి 300ఎంఎల్ మంచి నీటిని పోసి 20 నిమిషాల పాటూ పెసరపప్పును నీటిలో నాననివ్వాలి.
ఆ తర్వాత పెసరపప్పును వడగట్టి, ఆ నీటిని గ్లాసులో పోసి జ్వరం వచ్చిన వారిచేత తాగకపోయినా సరే బ్రతిమాలి తాగించండి.
ఇలా చేయడం వలన 10 నిమిషాల్లోనే నెమ్మదిగా శరీరంలో వేడి తగ్గుతూ 20 నుంచి 30 నిమిషాల్లో వేడి పూర్తిగా తగ్గిపోతుంది.
జ్వరం వచ్చినప్పుడు మన నోరు చేదు, చప్పదనంగా అనిపిస్తుంటుంది కదా అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఏదైనా తినాలని కూడా అనిపిస్తుంటుంది. ఇక డాక్టర్ ఇచ్చిన మందులు కూడా తీసుకుంటే మీ జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది.
పెసరపప్పుకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. అందులో విటమిన్స్, మాంగనీస్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వలన మన శరీరంలో ఉన్న వేడిని హరిస్తుంది .