NTV Telugu Site icon

Patient Spot Dead: ఢిల్లీ ఆసుపత్రిలో కాల్పులు.. రోగి మృతి..

Patient Spot Dead

Patient Spot Dead

Patient Spot Dead : ఆదివారం (జూలై 14) ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం సంభవించింది. గురు తేగ్ బహదూర్ (GTB) ఆసుపత్రిలో ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తి రోగిపై కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే మృతి చెందిన రోగిని 32 ఏళ్ల రియాజుద్దీన్‌ గా గుర్తించారు. ఇక ఆ వ్యక్తి దాదాపు 21 రోజుల ముందు నుండే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆసుపత్రి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా రియాజుద్దీన్ జూన్ 23 న చేరారు. అప్పటి నుంచి ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆదివారం జూన్ 14 సాయంత్రం 4.00 గంటల సమయంలో ఒక బాలుడు అతనిని కలవడానికి వచ్చి అతనిని కాల్చాడు. దాంతో రియాజుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Bandi Sanjay: హరీష్ రావు పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

నిందితుడి వయస్సు దాదాపు 18 ఏళ్లు ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీటీబీ ఎన్‌క్లేవ్‌ లోని వార్డు నంబర్ 24లో కాల్పులకు సంబంధించి పీసీఆర్ కాల్ వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు రోగి రియాజుద్దీన్ చనిపోయి ఉన్నాడని తెలిపారు. కడుపు ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జూన్ 23, 2024 న ఆసుపత్రిలో చేరాడని.. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో సుమారు 18 ఏళ్ల బాలుడు వార్డులోకి వచ్చి రియాజుద్దీన్‌ను కాల్చి చంపాడని తెలిపారు.

Jio Sound Box : త్వరలో జియో సౌండ్‌ బాక్స్‌.. క్షణాల్లో చెల్లింపులు..

దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అంతకుముందు జూలై 13న రాజధానిలోని లజ్‌పత్ నగర్‌లో ర్యాపిడ్ ఫైరింగ్ జరిగింది. దుండగులు ఇక్కడ సుమారు 10 – 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడినట్లు సమాచారం. గ్యాంగ్‌ స్టర్ల ముఠా పోటీ కారణంగానే ఈ బుల్లెట్లను కాల్చినట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటన వెనుక గల కారణాలపై ఇంకా సమాచారం వెల్లడి కాలేదు.