Delhi gangster suicide: దేశ రాజధాని జైలులో ఓగ్యాంగ్‌స్టర్ సూసైడ్ చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. సల్మాన్ త్యాగి పశ్చిమ ఢిల్లీలో పెద్ద గ్యాంగ్‌స్టర్. ఆయన నీరజ్ బవానా నుంచి లారెన్స్ బిష్ణోయ్ వరకు ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్ కోసం పని చేసినట్లు వార్తలు ఉన్నాయి. మోకా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన మండోలి జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహం జైలు సెల్‌లో బెడ్‌షీట్‌కు వేలాడుతూ కనిపించింది. సల్మాన్ త్యాగిపై దోపిడీ, హత్య వంటి డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులు ఉన్నాయి.
READ MORE: Tirupathi : శ్రీవారి దర్శన టికెట్లకు పెరిగిన డిమాండ్ !
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
మోకా కేసులో అరెస్ట్ అయిన సల్మాన్ త్యాగి మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన జైలులో నంబర్ 15 సెల్‌లో ఉంటారు. ఈక్రమంలో ఆయన ఉండే సెల్‌లో మృతదేహం బెడ్‌షీట్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. సల్మాన్ కుటుంబ సభ్యులకు అతని మరణం గురించి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అతని మరణం వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సల్మాన్ త్యాగిపై హత్య, దోపిడీకి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. ఆయనపై MCOCA (మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం) కేసు కూడా ఉంది.
సల్మాన్ త్యాగి ఒకప్పుడు నీరజ్ బవానా గ్యాంగ్లో పనిచేశాడు. తరువాత లారెన్స్ బిష్ణోయ్‌కు స్నేహితుడయ్యాడు. గత ఏడాది ఆయన జైలులో ఉన్నప్పుడు, పశ్చిమ ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలను రూ. 50 లక్షల కోసం కాల్చి చంపమని తన గ్యాంగ్ సభ్యులకు ఆదేశాలు ఇచ్చాడు. దీనిని ఆయన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోకి వెళ్లడానికి చేసినట్లు కథనాలు ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీపాంషు, మొయినుద్దీన్ అనే ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్టు చేశారు. వీరు సల్మాన్ త్యాగి ఆదేశాల మేరకు రాజౌరీ గార్డెన్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ రోజే టీజర్..
