NTV Telugu Site icon

Doctor Murder: వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు!

Gun Fire

Gun Fire

Doctor Murder: ఢిల్లీలోని జైత్‌పూర్‌లో బుధవారం సాయంత్రం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది . ఇక్కడ ఇద్దరు మైనర్లు ఆసుపత్రిలోకి ప్రవేశించి వైద్యుడిని కాల్చిచంపారు. ఈ ఘటన కాళింది కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖద్దా కాలనీలో చోటుచేసుకుంది. మైనర్ డ్రెస్సింగ్ కోసం నీమా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ అతను డాక్టర్ జావేద్ అక్తర్ తలపై కాల్చాడు. నేరం చేసిన నిందితులు ఘటనాస్థలం నుంచి పారిపోయిన ట్లు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది.

Hangover Tips: హ్యాంగోవర్ పోవడానికి ఇలా ట్రై చేయండి!

గాయపడిన ఇద్దరు మైనర్లు చికిత్స పొందేందుకు వచ్చారని నర్సింగ్‌హోమ్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. కట్టు కట్టిన తర్వాత డాక్టర్‌ని కలవాలని వారు కోరగా., కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ బలవంతంగా డాక్టర్ గదిలోకి ప్రవేశించి కాల్చి చంపారు. దీంతో డాక్టర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఉద్యోగులు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు. అయితే, హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Viral Video: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. పెళ్లి సంబరాల్లో చిరిగిపోయిన వరుడి ప్యాంటు!

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచార హత్యపై దేశవ్యాప్తంగా వైద్యులలో ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. తమ భద్రత, ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల వైద్యులు 11 రోజుల సమ్మెకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని ఈ కేసు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించినది. అయినప్పటికీ., పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

Show comments