ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. 10 రోజులు ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరగా.. ఆరు రోజులు మాత్రం న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు ఈడీ అధికారులు విచారించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. గత రాత్రంతా ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వారిని ఎక్కడికక్కడే పోలీసులు నిలువరించారు. మరోవైపు ఆప్ మంత్రులను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇక కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రతిపక్ష నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా తమ వ్యతిరేకతను తెలిపారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇలా టార్గెట్ చేయడం తప్పు అని.. రాజ్యాంగ విరుద్ధం. ఈ విధంగా రాజకీయాల స్థాయిని తగ్గించడం ప్రధానమంత్రికి సరికాదు అని ప్రియాంక గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. అలాగే శరద్ పవార్ కూడా తప్పుపట్టారు. ఇక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై ఇండియా కూటమి నేతలంతా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: DMK Ponmudy: గవర్నర్ దిద్దుబాటు.. మంత్రిగా పొన్ముడి ప్రమాణస్వీకారం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ తొమ్మిది సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన్ను గురువారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానంలో కూడా కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు.
ఇది కూడా చదవండి: Harish Rao : బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా రేవంత్ రెడ్డి తీరు
Delhi court remands CM Arvind Kejriwal on ED custody till 28 March in excise policy case. pic.twitter.com/sfqPHw2Oe8
— ANI (@ANI) March 22, 2024