Site icon NTV Telugu

RCB: ఉబర్ యాడ్ పై వివాదం.. ఆర్సీబీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు!

Rcb

Rcb

RCB: ఆర్సీబీకి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ట్రావిస్ హెడ్ నటించిన ఓ యాడ్ తమను కించపరిచేలా ఉందంటూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఆ ప్రకటనపై ఎలాంటి జోక్యం అవసరం లేదని జస్టిస్ సౌరభ్ బెనర్జీ అన్నారు. అది కేవలం క్రీడా స్ఫూర్తికి సంబంధించిన ప్రకటన అని కోర్టు పేర్కొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ మధ్య ఓ యాడ్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఉబర్‌ సంస్థతో కలిసి ఆయన చేసిన ఈ యాడ్ కాస్త వివాదానికి దారి తీసింది. ఆ యాడ్ లో బడ్డీస్ ఇన్ బెంగళూరు ఫీచర్ ట్రావిస్ హెడ్ అనే లైన్ యూజ్ చేశారు. అయితే ఇది తమ బ్రాండ్‌ను కించపరిచేలా ఉందంటూ ఆర్సీబీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Read Also: India-Pakistan tensions: యుద్ధం వస్తే పాకిస్తాన్‌ ‘‘అడుక్కు తినడమే’’.. మూడీస్ నివేదిక..

ఆర్సీబీని ఎగతాళి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ యాడ్‌ను చిత్రీకరించారని పిటిషన్ లో పేర్కొంది. ఇప్పటికే ఆర్సీబీకి ఫ్యాన్స్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఆ యాడ్ పై చర్యలు తీసుకోవాలని కల్ట్ ఫ్యాన్స్ ఆర్సీబీకి విజ్ఞప్తి చేశారు. పైగా ఒక్క టైటిల్ కూడా గెలవని ఆ జట్టు ఈ సారి టేబుల్ టాప్ లో నిలిచింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ కప్ కొడుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో ఆర్సీబీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబోమని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉబెర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Exit mobile version