Site icon NTV Telugu

Money Laundering Case: సోనియా గాంధీ, రాహుల్లకు షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ!

Sonia

Sonia

Money Laundering Case: సోనియా గాంధీ, రాహుల్లకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా నోటీసులు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు సంబంధించి కాంగ్రెస్ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు ఇతర ప్రతిపాదిత నిందితులకు కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నోటీసులు వారి పేర్లపై దాఖలైన చార్జ్‌షీట్‌పై కోర్టు వాదనలు వినేందుకు ఇచ్చినవిగా పేర్కొంది.

Read Also: Vivo Y19 5G: రూ.10,499 లకే 6.74 అంగుళాల డిస్ప్లే, 5500mAh బ్యాటరీ ఉన్న వివో స్మార్ట్ ఫోన్

ఈ విషయమై కోర్టు తెలిపిన ప్రకారం.. ఈ కేసు సంబంధించి ఇప్పటికే చార్జ్‌షీట్‌లో ఉన్న లోపాలను తొలగించారని పేర్కొంది. అయితే ఇప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే.. భారతీయ నగరిక సురక్షా సంహిత (BNSS) లోని సెక్షన్ 223 ప్రకారం నోటీసులు జారీ చేయాలా అనే అంశమేనని న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసును తదుపరి విచారణ 2025 మే 8 కు వాయిదా వేసారు. అయితే, ఈ దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కోర్టు ముందు వాదనలు వినిపించే హక్కు ఉందని కోర్టు స్పష్టంగా తెలిపింది. ఇది BNSS సెక్షన్ 223 ప్రకారం వచ్చే ప్రత్యేక హక్కు అని పేర్కొంది. ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనలకు వ్యతిరేకంగా కాదని కోర్టు అభిప్రాయపడింది.

అలాగే, తదుపరి దశలలో న్యాయమైన విచారణ కోసం ఈ హక్కు కీలకమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ దశలో ఆరోపణలపై వాదనలు వినడమే న్యాయపరమైన న్యాయ విచారణకు ప్రాణం పోసే అంశమని కోర్టు పేర్కొంది. ఇక ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తెలిపిన విషయమేమిటంటే.. ప్రస్తుత దశలో నోటీసుల జారీకి ఈడీ వ్యతిరేకం కాదని, న్యాయపరమైన విచారణ సూత్రాలను మద్దతిస్తున్నామని తెలిపారు.

Read Also: iPhone- India: భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తే ధరలు తగ్గుతాయా?

ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ప్రకారం.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి నేషనల్ హెరాల్డ్ ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు క్రిమినల్ కూనస్యిరసీ పథకాన్ని అమలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకారం రూ. 2,000 కోట్లకు పైగా విలువ ఉన్న ఆస్తులను కేవలం రూ. 50 లక్షలతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలోకి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థను సోనియా, రాహుల్ నియంత్రిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఇక ఈ కేసులో సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు సామ్ పిత్రోడా, సుమన్ దుబే లను కూడా ఆరోపణలతో చేర్చారు.

Exit mobile version