ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మే 14 వరకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో వారంలో కవితపై ఈడీ ఛార్జ్‌షీటు దాఖలు చేయనుంది. ప్రత్యేక న్యాయస్థానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. 60 రోజుల్లోగా విధిగా ఈడీ ఛార్జ్‌షీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. బలమైన కారణాలుంటే.. అదనంగా మరో నెల ఛార్జ్‌షీటు దాఖలు చేసేందుకు సమయం పొడిగించవచ్చు. మొత్తం కలిపి 90 రోజుల్లోగా ఛార్జ్‌షీటు దాఖలు చేయకపోతే.. నిందితులకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు అవుతుంది.
ఇది కూడా చదవండి: Teja Sajja: పవన్ కి సూపర్ హీరో సపోర్ట్..
మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన కవిత.. బంధువుల్ని కలిసేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి కవిత విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఉన్న సెల్‌లో ముగ్గురు బంధువులతో కలిసి భోజనం చేసేందుకు ప్రత్సేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరీ బవేజా అనుమతించింది. ఇదిలా ఉంటే కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్తూ మీడియాతో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి.. దేశం దాటించి.. తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారని వాపోయారు. ఇది అన్యాయం.. దీన్ని అందరూ గమనించాలని కవిత కోరారు.
ఇది కూడా చదవండి: Radhika Khera: కాంగ్రెస్ వేధింపుల కారణంగా బీజేపీలో చేరిన రాధికా ఖేరా..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం సీబీఐ కస్టడీకి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక పలుమార్లు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి.
#WATCH | Delhi excise policy case | BRS leader K Kavitha leaves from Rouse Avenue Court, says, "Investigation agencies are leaving people like Prajwal Revanna and arresting people like us." pic.twitter.com/LEVyiUEnrf
— ANI (@ANI) May 7, 2024