Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మాలివాల్‌కు అత్యాచార బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. అలాంటిది ఏకంగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కే బెదిరింపులు వస్తే పరిస్థితి ఏంటి?. తాజాగా ఇలాంటిదే జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మాలివాల్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌ను షో నుంచి తొలగించాలని స్వాతి కోరడంతో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. మీటూ ఉద్యమంలో కొందరు మహిళలు సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఈ నెల 10న లేఖ రాశారు. 2018లో దేశంలో కొనసాగిన మీటూ ఉద్యమం సమయంలో పలువురు సినీ తారలు, మోడళ్లు, పాత్రికేయులు సాజిద్ ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అప్పుడు సినిమాలకు దర్శకత్వం వహించకుండా సాజిద్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని మాలివాల్ పేర్కొన్నారు.
Flying Cars: ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్.. దుబాయ్‌లో పరీక్ష విజయవంతం
Also Read
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఆమె కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమెకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. రియాల్టీ షో బిగ్‌బాస్ నుంచి సినీ దర్శకుడు సాజిద్ ఖాన్ని తప్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాసిన తర్వాత తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని దిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె కోరారు. మీటూ ఉద్యమంలో భాగంగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పిన వారికి అండగా నిలబడినందుకు తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఆమె వెల్లడించారు. ఇలాంటి క్రిమినల్స్ కటాకటాల వెనక్కి పంపాలన్నారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పరిస్థితే ఇలా ఉంటో.. మీటూ ఉద్యమంలో తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చని స్వాతి మాలివాల్ ఆవేదని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!