NTV Telugu Site icon

Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతి మాలివాల్‌కు అత్యాచార బెదిరింపులు

Swati Maliwal

Swati Maliwal

Swati Maliwal: దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. అలాంటిది ఏకంగా మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కే బెదిరింపులు వస్తే పరిస్థితి ఏంటి?. తాజాగా ఇలాంటిదే జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతి మాలివాల్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌ను షో నుంచి తొలగించాలని స్వాతి కోరడంతో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. మీటూ ఉద్యమంలో కొందరు మహిళలు సాజిద్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె.. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు ఈ నెల 10న లేఖ రాశారు. 2018లో దేశంలో కొనసాగిన మీటూ ఉద్యమం సమయంలో పలువురు సినీ తారలు, మోడళ్లు, పాత్రికేయులు సాజిద్ ఖాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అప్పుడు సినిమాలకు దర్శకత్వం వహించకుండా సాజిద్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని మాలివాల్ పేర్కొన్నారు.

Flying Cars: ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్‌.. దుబాయ్‌లో పరీక్ష విజయవంతం

ఆమె కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమెకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. రియాల్టీ షో బిగ్‌బాస్‌ నుంచి సినీ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ని తప్పించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి లేఖ రాసిన తర్వాత తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యాచార బెదిరింపులు వస్తున్నాయంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్టు చేయాలని దిల్లీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆమె కోరారు. మీటూ ఉద్యమంలో భాగంగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పిన వారికి అండగా నిలబడినందుకు తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఆమె వెల్లడించారు. ఇలాంటి క్రిమినల్స్‌ కటాకటాల వెనక్కి పంపాలన్నారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పరిస్థితే ఇలా ఉంటో.. మీటూ ఉద్యమంలో తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చని స్వాతి మాలివాల్ ఆవేదని వ్యక్తం చేశారు.