CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Price Hike: పెట్రోల్ ధరలతో పాటు సీఎన్జీ ధరలు కూడా వరుసగా పెరుగుతూనే ఉ్నాయి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు సీఎన్జీ ధరల పెంపు కూడా అదనపు భారంగా మారింది. తాజాగా సీఎన్జీ ధరను కిలోకు రూ.2 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో జాతీయ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.83.09కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ సంక్షోభం కారణంగా దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇటీవలి రోజుల్లో సీఎన్జీ ధరలు వరుసగా రెండుసార్లు పెరిగాయి. మొత్తంగా గత 12 రోజుల్లోనే కిలోకు రూ.6 మేర ధర పెరగడం గమనార్హం. దీంతో పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు సీఎన్జీ కూడా సామాన్యుడి జేబుకు భారంగా మారింది. ప్రత్యేకంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాణిజ్య వాహనాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆటోలు, టాక్సీలు, స్కూల్ వ్యాన్లు, ప్రైవేట్ కార్లు పెద్దఎత్తున సీఎన్జీపై ఆధారపడుతున్నాయి. తరచూ ధరలు పెరగడం వల్ల తమ రోజువారీ ఆదాయం తగ్గిపోతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన వ్యయాలతో జీవనోపాధి కష్టంగా మారుతోందని ఆటో, టాక్సీ యూనియన్లు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రయాణ ఛార్జీలు, సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!