Site icon NTV Telugu

Kejriwal: బీజేపీ కుట్ర.. మా ఎమ్మెల్యేలను కొనేందుకే నన్ను అరెస్ట్ చేస్తారటా..?

Kejriwal

Kejriwal

ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆప్ పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను కొని తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ట్రై చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మధ్యే మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు సంప్రదించినట్లు తెలిసింది.. లిక్కర్‌ స్కామ్ కేసులో మరికొద్ది రోజుల్లో మీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు తప్పదని మా ఎమ్మెల్యేలను బెదిరించారని ఆయన ఆరోపించారు. అరెస్టు తర్వాత ప్రభుత్వాన్ని కూలుస్తామన్నారు.. ఇప్పటికే తమకు ఆప్‌ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు బీజేపీ వారు తెలిపారు.. మీరు కూడా మాతో కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్‌తో పాటు 25 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఏడుగురు ఎమ్మెల్యేలకు కమలం పార్టీ ఆశ చూపించినట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా ( ఎక్స్‌) వెల్లడించారు. అయితే, తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ ఇలా చేస్తోందని ఆయన మండిపడ్డారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు అందరూ కమలం పార్టీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
7 AAP MLAs Offered Rs 25 Crore By BJP : Arvind Kejriwal | NTV

Exit mobile version