NTV Telugu Site icon

Arvind Kejriwal: ‘రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తా’.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Arvind Kejriwal

Arvind Kejriwal

ఎక్సైజ్ పాలసీ ‘స్కాం’ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన రెండు రోజుల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం సీఎం కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ పెద్ద ప్రకటన చేస్తూ.. ‘రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తాను’ అని ప్రకటించారు.

READ MORE: Bhupathiraju Srinivasa Varma: విశాఖ స్టీల్ ప్లాంట్కు బొగ్గు కొరత కొత్తగా వచ్చిన సమస్య కాదు..

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈరోజు నుంచి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నాను. సీఎం కుర్చీలో కూర్చోను. కేజ్రీవాల్ నిజాయితీపరుడని ప్రజలు తీర్పు ఇచ్చే వరకు నేను కుర్చీలో కూర్చోను. సతేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ కూడా త్వరలో బయటకు వస్తారు. ఢిల్లీ ప్రజలు మా కోసం ప్రార్థించారు. వారికి నా ధన్యవాదాలు… జైల్లో ఎన్నో పుస్తకాలు చదివాను – రామాయణం, గీత… భగత్ సింగ్ జైలు డైరీని నా వెంట తెచ్చుకున్నాను. భగత్ సింగ్ డైరీని కూడా చదివాను.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Thalapathy69 : విజయ్ చివరి సినిమాకు అవెంజర్స్ హీరో స్థాయి రెమ్యునరేషన్..?

కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టైన ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. నిన్న ( శనివారం ) భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి న్యూఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Show comments