NTV Telugu Site icon

Excise Policy Case: సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

Kejriwal

Kejriwal

Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఢిల్లీ సీఎం ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. అయితే, జూన్ 26వ తేదీన ముఖ్యమంత్రిని వెకేషన్ జడ్జి అమితాబ్ రావత్ మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపించారు. ఈ సమయంలో అరెస్టును చట్టవిరుద్ధం అని చెప్పలేమని న్యాయమూర్తి అన్నారు.

Read Also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?

అయితే, ఈ అరెస్టు చట్ట విరుద్ధం కాదని, సీబీఐ అత్యుత్సాహం చూపవద్దని వెకేషన్ న్యాయమూర్తి అమితాబ్ రావత్ పేర్కొన్నారు. ఆ తర్వాత జూన్ 29న వెకేషన్ జడ్జి సునైనా శర్మ అరవింద్ కేజ్రీవాల్‌ను జులై 12వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కిందికోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. ఇక, ఎక్సైజ్ పాలసీ కేసులో “కీలక కుట్రదారుల” జాబితాలో కేజ్రీవాల్ పేరు ఉందని సీబీఐ చెప్పింది.

Read Also: Damodar Raja Narasimha: 10 రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన

ఇక, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరిన ఈడీ.. అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తులో సహకరించలేదని న్యాయస్థానంలో తెలిపింది. ఆయనకు బెయిల్ ఇస్తే.. బయటకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవచ్చని పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21వ తేదీన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన ఈడీ, సీబీఐ కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.