Site icon NTV Telugu

Aravind Kejriwal : కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్.. జూన్ 2 లొంగిపోవాల్సిందే

aravind-kejriwal

New Project 2024 05 30t134032.291

Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని పిటిషన్‌ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్‌ దరఖాస్తును స్వీకరించేందుకు కోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఇచ్చింది. కేజ్రీవాల్ దరఖాస్తు విచారణకు అర్హమైనది కాదు. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది.

మే 10న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోవాలని కోరారు. మే 17న పీఎంఎల్‌ఏ కేసులో అతని అరెస్టు చట్టబద్ధత పై సవాలు చేస్తూ ఈడీపై ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం, సుప్రీంకోర్టులోని మరో బెంచ్ కూడా కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. సీజీఐ డీవై చంద్రచూడ్‌ను సంప్రదించాలని కోరింది.

Read Also:Brij Bhushan Sharan : అదుపుతప్పిన బ్రిజ్‌భూషణ్ సింగ్ కుమారుడి కారు.. ఇద్దరు మృతి

పిటిషన్‌లో కేజ్రీవాల్ ఏం చెప్పారు?
అరవింద్ కేజ్రీవాల్ అకస్మాత్తుగా ఆరేడు కిలోల బరువు తగ్గినందున అనేక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ వ్యవధిని ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తిరిగి జైలుకు వెళ్లేందుకు కోర్టు నిర్దేశించిన జూన్ 2న కాకుండా జూన్ 9న లొంగిపోవాలని కేజ్రీవాల్ మే 26న దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అతని బరువు ఆరేడు కిలోల వరకు తగ్గిందని, అతని కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని, ఇది తీవ్రమైన కిడ్నీ, గుండె జబ్బులు, క్యాన్సర్‌కు కూడా సూచిక అని పిటిషన్‌లో పేర్కొంది. ముఖ్యమంత్రికి పీఈటీ-సీటీ స్కాన్‌తోపాటు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. మే 10న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జూన్ 1వ తేదీ వరకు అంటే 21 రోజుల వరకు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాని ప్రకారం జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. దీనికి ఒకరోజు ముందుగా ఏడో, చివరి దశ ఓటింగ్ జరగనుంది.

Read Also:Today Gold Rate: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవే!

ఈడీ ఆరోపణ ఏమిటి?
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చింది. ఈ కుంభకోణంతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు, పార్టీకి సంబంధం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కుంభకోణంలో ప్రధాన కుట్రదారు అరవింద్ కేజ్రీవాల్ అని, ఇందులో ఇతర ఆప్ నేతలు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారని ఈడీ ఆరోపించింది.

Exit mobile version