NTV Telugu Site icon

Kejriwal: ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ మరోసారి ఆదేశాలు..

Kejriwal

Kejriwal

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్నారు. అయితే, అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తుండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టగా.. ఇదే టైంలో తాజాగా, మరోసారి ఉత్తర్వులను ఆయన జారీ చేశారు.

Read Also: Viral Video: అతి చేయొచ్చు కానీ.. మరి మితిమీరకూడదు..ఒకవేళ చేస్తే ఇలాగే ఉంటాది కాబోలు..!

ఇక, ఇవాళ (మంగళవారం) ఉదయం లాకప్‌ నుంచి కేజ్రీవాల్‌ రెండోసారి ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్‌ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం కేజ్రీవాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి చెప్పుకొచ్చారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల కేజ్రీవాల్ నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్‌ ద్వారా ఉత్తర్వులను జారీ చేశారు.

Read Also: RC17 : రామ్ చరణ్, సుకుమార్ మూవీ స్టోరీ లీక్ చేసిన కార్తికేయ..

అయితే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. సీఎం ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు ఈడీ చర్యలను చేపట్టింది. దీనిపై ఆతిశీని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది.