RC17 : రామ్ చరణ్, సుకుమార్ మూవీ స్టోరీ లీక్ చేసిన కార్తికేయ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ మూవీ రిలీజ్ గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు…రీసెంట్ గా రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఆర్సీ16 షూటింగ్ కూడా మొదలైంది. ఇక సోమవారం (మార్చి 25) హోలీ సందర్భంగా ఆర్సీ17 కూడా అనౌన్స్ చేసేశారు. సుకుమార్ తో రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా గురించి రాజమౌళి తనయుడు కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.రామ్ చరణ్, సుకుమార్ కాంబో ఆరేళ్ల కిందట రంగస్థలం మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేసిందో మనందరికి తెలిసిందే.రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుంది అంటే అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీ గురించి తనకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలోనే తెలుసని రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పడం విశేషం.ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ వచ్చిన కాసేపటికి అతడు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా గురించి ఎక్కువ లీక్ చేయనంటూనే కార్తికేయ చెప్పిన విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతకీ ఆ ట్వీట్ లో అతడు ఏమన్నాడంటే..”ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో సుకుమార్ గారితో మూవీ చేయబోతున్నట్లు చరణ్ మాటల సందర్భంగా చెప్పాడు. అంతేకాదు మూవీలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి వివరించాడు. ఐదు నిమిషాల పాటు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అతడు ఆ విషయం చెప్పినప్పటి నుంచీ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ గురించి ఎదురు చూస్తున్నాను. ఆ మూవీ ఓ బ్లాక్‌బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక అది ఓ ఐకానిక్ సీక్వెన్స్ అవుతుంది. నేను దీని గురించి మరీ ఎక్కువగా లీక్ చేయనులే” అంటూ రామ్ చరణ్ ను కార్తికేయ ట్యాగ్ చేశాడు.ఆర్సీ17 అనౌన్స్‌మెంట్ రాగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు కార్తికేయ ట్వీట్ తో అవి మరింత రెట్టింపయ్యాయి. రంగస్థలం మూవీ చరణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడతనితో మరెలాంటి మ్యాజిక్ సుకుమార్ చేస్తాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!