NTV Telugu Site icon

Ayodhya: రామమందిరంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పూజలు

Ayodhya Cms

Ayodhya Cms

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుటుంబం (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుటుంబం (Punjab CM Bhagwant Mann) ఆయోధ్యలో (Ayodhya) పర్యటించారు. ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగిన రామమందిరాన్ని (Ram Temple) ముఖ్యమంత్రుల కుటుంబాలు సందర్శించి.. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రామాలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.. రామమందిరంలో ప్రార్థనలు చేసిన తర్వాత తాను వర్ణించలేని ప్రశాంతతను అనుభవించినట్లు తెలిపారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తున్నారని.. వారి ప్రేమను చూడటం నిజంగా హృదయపూర్వకంగా సంతోషంగా ఉందని పేర్కొ్న్నారు. ఎంతో భక్తితో భక్తులు మందిరాన్ని సందర్శిస్తున్నారని ఆయన కొనియాడారు.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. రాముడ్ని దర్శించుకోవాలనే కోరిక చాలా కాలంగా ఉందని.. అది ఇప్పుడు నెరవేరిందని తెలిపారు. దేశ సంక్షేమం కోసం ప్రార్థించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

 

Show comments