Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Protest: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన కారణంగా రాజధాని పూర్తిగా దద్దరిల్లిపోతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ నగరమంతా పోలీసులు భారీ భద్రత మధ్య ఒక కోటలా మారిపోయింది. రాజధాని సరిహద్దులన్నిటితో పాటు, సెంట్రల్ ఢిల్లీలోనూ, నిరసనకారులు గుమిగూడే అవకాశం ఉన్న ప్రతి కూడలిలోనూ భారీగా బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఆగ్నేయ ఢిల్లీలోని మోహన్ ఎస్టేట్ పారిశ్రామిక ప్రాంతంలో బారికేడ్లతో పాటు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్‌ను (ముళ్ల కంచెలు/బల్లెపు ముళ్లు ఉన్న స్ట్రిప్స్) కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. నిషిద్ధ ప్రాంతాల వైపు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. మోహన్ కోఆపరేటివ్ ఎస్టేట్ ప్రాంతంలో పోలీసులు భారీ కాపలా కాస్తూ, ప్రతి కార్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిగానీ ముందుకు వెళ్లనివ్వట్లేదని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ఫామ్ 6 మార్పుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. సీజేపీ తరఫున ఇలాంటి ఆందోళన జరగడం ఇది రెండోసారి. మరోవైపు, ఈ నిరసనలను అణచివేయడానికి పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. ధ్రువ్ రాఠీ, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే విమానం నుంచి దిగుతుండగా పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లతో పాటు సీజేపీకి చెందిన మరికొందరు ముఖ్య నేతలు, నగరవ్యాప్తంగా దాదాపు 500 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 20 వేలకు పైగా పోలీసులను, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) బలగాలను రంగంలోకి దించింది. ఈ నిరసనల ఎఫెక్ట్ రవాణా రంగంపై కూడా గట్టిగానే పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ను పోలీసులు కోరారు. దీంతో డీఎంఆర్సీ ఏకంగా 45 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేసింది. అలాగే శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవాల్సిన ఇతర రాష్ట్రాల రైళ్లు, లోకల్ ట్రైన్లు కలిపి మొత్తం 250కి పైగా రైళ్లను రద్దు చేశారు.
Also Read
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
తాజావార్తలు
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!