NTV Telugu Site icon

Arvind Kejriwal: 156 రోజుల జైలు జీవితం.. సీఎం కేజ్రీవాల్ విడుదల

Arvind Kejriwal

Arvind Kejriwal

మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయ్యారు.

READ MORE: US elections: కమలా హారిస్ గెలిస్తే వైట్ హౌజ్ మొత్తం ‘‘కర్రీ’’ వాసనే.. లారా లూమర్ వివాదాస్పద వ్యాఖ్యలు..

మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. 10 రోజుల విచారణ అనంతరం ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం మే 10న 21 రోజుల పాటు విడుదలయ్యారు. మరో 51 రోజుల పాటు తర్వాత జైలులో ఇప్పుడే విడుదలయ్యారు. కేజ్రీవాల్ నేటికీ 177 రోజులు జైలులో గడిపారు. ఎన్నికల సందర్భంగా 21 రోజులను తగ్గిస్తే.. కేజ్రీవాల్ మొత్తం 156 రోజులు జైలులోనే ఉన్నారు.

READ MORE:బిగ్ బాస్ 8 … షాకింగ్ రేటింగ్

జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. “మొదట నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన కారణంగా నేను బయటకు వచ్చాను. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలలో ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. నా ప్రతి రక్తపు బొట్టు దేశానికే అంకితం.” అని చెప్పారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని .. వారి జైలు నా ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయిందని తెలిపారు.

READ MORE:Investment Fraud : హైదరాబాద్ లో భారీ మోసం.. పెట్టుబడుల పేరుతో రూ.700 కోట్లకు టోకరా

కాగా.. సీఎంకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే, న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు. ‘‘అరెస్టు చేసిన సమయంలో అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తుతోంది. బెయిల్ పొందిన కేజ్రీవాల్‌ను నిరాశపర్చడం కోసమే అరెస్టు చేసినట్టుగా అనిపించింది.” అని పేర్కొన్నారు.

Show comments