NTV Telugu Site icon

LSGvsDC : రసవత్తరమైన మ్యాచ్ లో ఢిల్లీ విజయం..

Lsg Vs Dc

Lsg Vs Dc

LSGvsDC : ఐపీఎల్ 2025 టోర్నీ భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టంతో 209 పరుగులు సాధించింది. లక్నో జట్టు నుండి మిచెల్ మార్ష్ (72) , నికోలస్ పూరన్ (75) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఢిల్లీ బౌలర్లపై దాడి చేశారు. వీరి ఇన్నింగ్స్‌లతో లక్నో జట్టు భారీ స్కోర్ నమోదు చేయగలిగింది. అదనంగా, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ (27) రాణించడంతో లక్నో జట్టు 210 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందు పెట్టగలిగింది.

210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. డూ ప్లెజిస్ (29) పరుగులతో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించగా, అతను కూడా అర్ధాంతరంగా ఔట్ అయ్యాడు. టాప్ ఆర్డ్ కూప్పకూలడంతో ఢిల్లీ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు తమ బ్యాట్లను కష్టంగా ఝుళిపించారు. అక్సర్ పటేల్ (22) , ట్రిస్టన్ స్టబ్స్ (34) పరుగులతో పరుగుల చుట్టు పుట్టడం ప్రారంభించారు.

అయితే, ఆ తర్వాత బరిలోకి వచ్చిన అశుతోష్ శర్మ (66 నాటౌట్) ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరును పరుగులు పెట్టించాడు. అతనితో పాటు విప్రాజ్ నిగమ్ (39) పరుగులతో ఢిల్లీ స్కోరును మరింత పెంచుతూ, విజయాన్ని దిశగా నడిపించారు. అశుతోష్ శర్మ తన వీరోచిత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ రసవత్తర పోరులో అదిరిపోయే విజయాన్ని అందించడంతో, 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఢిల్లీ విజయం సాధించింది. 211 పరుగులు చేసి ఢిల్లీ విజయపతాకాన్ని ఎగురవేసింది.

Nicholas Pooran: 6,6,6,6,4… ఒకే ఓవర్ లో పూరన్ ఊచకోత