ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. ఇంతకుముందు మ్యాచ్ లో ఓడిపోయిన కేకేఆర్.. ఈ మ్యాచ్ లో గెలిచి పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని డీసీ భావిస్తోంది.
ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్:
పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, రాసిఖ్ సలామ్, లిజాడ్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్.
కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సునీల్ నరైన్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా.
