DC vs SRH: ఐపీఎల్-2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. 277, 287 రికార్డు పరుగులు సాధించి ప్రత్యర్థి జట్లకు ప్రమాదకర హెచ్చరికలను జారీ చేసింది. టైటిల్‌యే లక్ష్యంగా విజయాలతో SRH దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచింది.
Read Also: Memantha Siddham Bus Yatra: 19వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
ఇక, హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ టీమ్ మరో ఆసక్తికర సమరానికి రెడీ అయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొట్టబోతుంది. బలాబలాలు పరంగా ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ సొంత మైదానంలో ఢిల్లీ జట్టును తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన స్థితికి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలని సన్‌రైజర్స్ అనుకుంటుంది. జట్టు కూర్పుపై ప్రత్యేక నజర్ పెట్టింది. ఈ సీజన్ ఆరంభంలో అలరించి తర్వాత పేవల ప్రదర్శన చేస్తున్న షాబాజ్ అహ్మద్‌ను పక్కన పెట్టాలని చూస్తుంది. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.
Read Also: Punjab : సంగ్రూర్ జైలులో రక్తపాతం.. ఇద్దరు ఖైదీలు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
కాగా, ఇప్పటి వరకు హైదరాబాద్, ఢిల్లీ 23 మ్యాచ్‌ల్లో పోటీ పడగా.. ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగింది. ఎస్‌ఆర్‌హెచ్ 12 సార్లు, ఢిల్లీ 11 సార్లు గెలిచాయి. అయితే, గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌పై ఢిల్లీదే పైచేయి సాధించింది. 2022లో జరిగిన ఒక్క మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌యే నెగ్గగా, గత సీజన్‌లో చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి.