NTV Telugu Site icon

WPL2023 : గ్రాండ్ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఫైనల్ బెర్త్ ఖరారు..?

Delhi Capitals

Delhi Capitals

సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్ ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది.

Also Read : WPL2023 : ప్లేఆఫ్‌కు యూపీ వారియర్స్‌.. ఇంటి దారి పట్టిన ఆర్సీబీ

పూజ వస్త్రకర్(19 బంతుల్లో 23, 3ఫోర్లు, ఒక సిక్స్ ), హర్మన్ ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23, 3 ఫోర్లు ), ఇసీవాంగ్ (24 బంతుల్లో 23, ఒక సిక్స్ ), అమన్ జ్యోత్ కౌర్ ( 16 బంతుల్లో 19, 2 ఫోర్లు ) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెస్ ( 2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి విజయం సాధించింది. షఫాలీ వర్మ ( 15 బంతుల్లో 33, 6 ఫోర్లు, ఒక సిక్స్ ) ఔట్ కాగా.. మెగ్ లానింగ్ ( 22 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, ఒక సిక్స్ ), అలైస్ క్యా్ప్నీ ( 17 బంతుల్లో 38 నాటౌట్, 1 ఫోర్, 5 సిక్స్ లు ) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు.

Also Read : Ragi Java Benefits : రాగిజావతో ప్రయోజనాలెన్నో!

ప్రస్తుతం ఢిల్లీ, ముంబై 10 పాయింట్లతో సమంగా ఉన్నా.. మెరుగైన రన్ రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్ ర్యాంక్ లో.. ముంబై రెండో ర్యాంక్ లో నిలిచాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ లో బెంగళూరుతో ముంబై ( మధ్యాహ్నం గం. 3.30 నుంచి).. యూపీతో ఢిలీ ( రాత్రి గం. 7.30 నుంచి ) ఆడతాయి. ముంబై, ఢిల్లీ జట్లలో భారీ తేడాతో నెగ్గిన జట్టు టాప్ ర్యాంక్ తో నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్ తో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది.

Show comments