Site icon NTV Telugu

DC vs GT: ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్.. గుజరాత్ లక్ష్యం 163

Ipl

Ipl

DC vs GT: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 162 గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్‌కు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ 37, సర్ఫరాజ్‌ ఖాన్‌ 30 పరుగులు చేయగా.. చివర్లో అక్షర్‌ పటేల్‌ 22 బంతుల్లో 36 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ 160 పరుగుల మార్క్‌ అందుకునేలా చేశాడు. గుజరాత్‌ బౌలర్లలో షమీ, రషీద్‌ ఖాన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Read Also: DC vs GT: కష్టాల్లో ఢిల్లీ.. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఇలా..

స్టేడియంలో రిష‌భ్ పంత్
ఇదిలా ఉండగా.. టీమిండియా క్రికెట‌ర్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మాజీ కెప్టెన్‌ రిష‌భ్ పంత్ ఢిల్లీ స్టేడియంలో సంద‌డి చేశాడు. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీని స‌పోర్ట్ చేస్తున్నాడు. బీసీసీఐ సభ్యుడు రాజీవ్ శుక్లా, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంఛైజీ య‌జ‌మాని పంత్‌ను విష్ చేసి, అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకున్నారు. గ‌త ఏడాది రూర్కెలా స‌మీపంలో పంత్ కారు యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే.

Exit mobile version