NTV Telugu Site icon

KL Rahul: కేఎల్ రాహుల్‌కు ప్రత్యేక విషెష్ చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. వీడియో వైరల్!

Delhi Capitals

Delhi Capitals

టీమిండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్ నటి అతియా శెట్టిలు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సోమవారం అతియా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాహుల్‌, అతియాలు తమ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రాహుల్‌, అతియా దంపతులకు క్రికెటర్స్, సెలబ్రిటీస్, ఫాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్ ప్లేయర్స్ ప్రత్యేక విషెష్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బోణీ కొట్టింది. విశాఖలో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై ఒక వికెట్ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఎల్‌ఎస్‌జీ ముందుగా 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అశుతోష్‌ శర్మ (66 నాటౌట్‌; 31 బంతుల్లో 5×4, 5×6), విప్రాజ్‌ నిగమ్‌ (39; 15 బంతుల్లో 5×4, 2×6), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (34; 22 బంతుల్లో 1×4, 3×6) మెరుపులతో ఢిల్లీ అనూహ్య విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఢిల్లీ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో కేఎల్ రాహుల్‌కు ప్రత్యేక విషెష్ చెప్పారు. ప్లేయర్స్ అందరూ బేబీ-స్వేయింగ్ సంజ్ఞతో రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ తప్పిదాలు.. లక్నో ఓనర్ ఏమన్నాడంటే?

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ అక్షర్ పటేల్, పేసర్ మిచెల్ స్టార్క్, మెంటర్ కెవిన్ పీటర్సన్‌తో సహా ఆటగాళ్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో బేబీ-స్వేయింగ్ సంజ్ఞతో కేఎల్ రాహుల్‌కు విషెష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ ప్రాంచైజీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. జట్టు అభినందన రాహుల్, అతియాల మధుర క్షణాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. రాహుల్, అతియాలు 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సతీమణి ప్రసవం నేపథ్యంలో లక్నో మ్యాచ్‌కు రాహుల్ దూరమయ్యాడు. గతేడాది లక్నోలో ఆడిన రాహుల్.. ఈసారి ఢిల్లీకి వచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ రూ.12 కోట్లకు రాహుల్‌ని కొనుగోలు చేసింది.