NTV Telugu Site icon

WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్​ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!

Mm

Mm

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో లీగ్ దశలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. బుధవారం నాడు జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెంట్స్ పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. దీంతో ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్ లో అడుగు పెట్టింది. గుజరాత్ జైన్స్ నిర్ణయించిన 127 పరుగుల స్వల్ప లక్షాన్ని ఢిల్లీ ఛేదించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ లో షఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగగా, జెమిమా రోడ్రిగ్స్ కూడా 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ప్రీమియర్​ లీగ్​ లో వరుసగా రెండోసారి ఫైనల్స్ ​కు చేరినట్లయింది.

కేవలం 127 పరుగుల లక్ష్య ఛేదనను ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త ఘనంగానే మొదలు పెట్టింది. ఈ మ్యాచ్ లో జరిగిన మూడో ఓవర్లోనే గుజరాత్ జెంట్స్ రెండు వికెట్లు తీసి గేమ్ ​లోకి వచ్చినట్లు కనిపించింది. ఇందులో
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ మెగ్ లానింగ్ రనౌట్​ అవ్వగా, ఇక అదే ఓవర్ లో అలీస్ కాప్సీ డక్ అవుట్ అయ్యి పెవిలియన్ బాట పట్టింది. పరిస్థితి ఇలా ఉన్న యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ మాత్రం ఎక్కడ జోరు తగ్గించలేదు. తన మార్క్ షాట్స్ తో బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. షఫాలీ వర్మకు తోడుగా జెమిమా రోడ్రిగ్స్​ కూడా అమూల్యమైన ఇన్నింగ్స్​ ఆడడంతో గుజరాత్ ​కు మరో ఛాన్స్ ఇవ్వలేదు ఇద్దరు. దింతో మూడో వికెట్ ​కు ఏకంగా 94 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 126 పరుగులు మాతరమే చేయగలిగింది. ఇందులో ఓపెనర్లు వోల్​వ్రాట్ 7, బెత్ ముూనీ డక్ అవుట్., స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆపై వన్ ​డౌన్ ​లో బ్యాటింగ్ కి వచ్చిన హేమలత కూడా కేవలం 4 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ప్రభావం చూపలేకపోయింది. గార్డ్​నర్ 12, ఫోబి లిచ్​ఫీల్డ్ 21 పరుగులు చేయగా.. భారతి ఫుల్ ​మలి 42, బ్రేస్ 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో గుజరాత్ జెంట్స్ ​కు ఆ మాత్రం స్కోరైనా దక్కింది.