IPL Player: బిగ్‌షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్‌పై పోలీస్ కేసు..

Porell

Porell

బెంగాల్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌పై హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత దాడికి పాల్పడి, బెదిరింపులకు గురిచేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఇండియా-ఎ జట్టుతో కలిసి యూకే, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లిన 23 ఏళ్ల పోరెల్.. ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించాడు. సదరు మహిళ, ఆమె తల్లి మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం.. సదరు మహిళకు, అభిషేక్ పోరెల్‌కు గత మూడేళ్లుగా పరిచయం ఉంది. అయితే, గత ఏడాది నుంచి వారి మధ్య విభేదాలు రావడంతో పోరెల్ ఆమెకు దూరం జరగడం ప్రారంభించాడని తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీనితో పాటు తనపై శారీరక దాడి, క్రిమినల్ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని పేర్కొంది. దీనిపై పిటిఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడిన ఒక పోలీసు అధికారి, తమకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ధృవీకరించారు.

×
×
Ad

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న అభిషేక్ పోరెల్ ఈ ఆరోపణలను పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశాడు. ప్రస్తుతం తాను ఆటలో రాణిస్తున్నందున, ఇలాంటి రకరకాల విషయాలను తెరపైకి తెస్తున్నారని మీడియాకు తెలిపాడు. ఇప్పటివరకు పోలీసులు తనను సంప్రదించలేదని, పోలీసుల ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత తాను ఈ విషయంపై పూర్తి వివరంగా స్పందిస్తానని చెప్పాడు.

ఎడమచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్, 2023 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులు చేశాడు. అలాగే, 2021-22 సీజన్‌లో బెంగాల్ జట్టు తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పోరెల్, ఇప్పటివరకు 32 ఫస్ట్-క్లాస్, 23 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు.