Site icon NTV Telugu

LSG vs DC : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.

Lsg Vs Dc

Lsg Vs Dc

ఐపీఎల్ డ‌బుల్ హెడ‌ర్‌లో ఈరోజు ల‌క్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌ యూపీలోని ఎకానా స్పోర్ట్స్ సిటీ వేదికగా జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే.. దాంతో, కేఎల్ రాహుల్ సేన మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ సీజ‌న్‌లో రిష‌భ్ పంత్ గైర్హాజ‌రీలో ఢిల్లీకి వార్నర్ సారథ్యం వహించనున్నాడు. మరోవైపు కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో గత సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన లక్నో సూపర్ జెయింట్స్, ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (కెప్టెన్‌), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్‌ కీపర్‌), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్‌ కీపర్‌), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

Also Read : KKR vs PBKS : కోల్‌కతా సాధించేనా.. 10 ఓవర్లకు స్కోర్‌ ఇలా

Exit mobile version